షెడ్ల నిర్మాణాలపై అధికారుల స్పందన ఏది?
మంచాల్ బైపాస్‌పై అనుమతులపై స్థానికుల ప్రశ్నలు
ఇబ్రహీంపట్నం, (మన దిశ): ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మంచాల్ బైపాస్ రోడ్డుపై కొనసాగుతున్న షెడ్ల నిర్మాణాలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టడంపై స్పష్టత లేదని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణాల విషయంలో అధికారుల తీరుపై కొన్ని అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ వాటిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.
షెడ్లకు సంబంధించిన అనుమతులు, స్థల వినియోగం, రహదారి నిబంధనలను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా నిర్మాణాలపై తమ వైఖరి, తీసుకున్న చర్యలపై మున్సిపల్ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






