Ibrahimpatnam

ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌కు పలుమార్లు వినతులు.. స్పందన లేదంటున్న ప్రయాణికులు

By ·

Share this article
ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

38 సర్వీస్ టైమింగ్ మార్చాలి.. కరోనా సమయంలో రద్దైన బస్సులు పునరుద్ధరించాలి

ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌కు పలుమార్లు వినతులు.. స్పందన లేదంటున్న ప్రయాణికులు

యాచారం( మన దిశ ): యాచారం మండల పరిధిలో ఆర్టీసీ బస్సుల సర్వీసులు, సమయాల మార్పుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 38వ నంబర్ సర్వీస్ బస్సు టైమ్ టేబుల్‌లో మార్పులు చేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

గతంలో ఉదయం 6:45 గంటలకు తాటిపర్తి నుంచి ఉమెన్స్ కాలేజ్‌కు 38వ సర్వీస్ బస్సు నడిచేదని, ప్రస్తుతం సమయ మార్పు కారణంగా ప్రయాణికులు బస్సుల కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉన్న విధంగానే 6:45 AM తాటిపర్తి ↔ ఉమెన్స్ కాలేజ్ సర్వీస్‌ను పునరుద్ధరించాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

కరోనా సమయంలో రద్దైన బస్సులు పునఃప్రారంభించాలి

కరోనా సమయంలో రద్దు చేసిన పలు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఇప్పటికైనా పునఃప్రారంభించాలని స్థానిక ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ స్పందన లేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రధానంగా రద్దైన సర్వీసుల్లో

1. తాటిపర్తి – హైదరాబాద్

2. మేడిపల్లి – హైదరాబాద్

3. ఆజిలాపురం – హైదరాబాద్

4. కొత్తపల్లి – హైదరాబాద్

5. మొండి గౌరెల్లి – హైదరాబాద్ నైట్ హాల్ట్ బస్సు

సర్వీసులు ఉన్నాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు విద్య, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం తదితర అవసరాల కోసం ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణిస్తుంటారని, బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రయాణికులు పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి 38వ సర్వీస్‌ను పాత సమయానికి మార్చడంతో పాటు, కరోనా సమయంలో రద్దు చేసిన అన్ని బస్సు సర్వీసులను యధావిధిగా పునఃప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Tags: