Telangana

రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్

18 ఏళ్లుగా ఎదురుచూపులేనా..? అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

By ·

Share this article
రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్

రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్

18 ఏళ్లుగా ఎదురుచూపులేనా..? అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

ఘట్కేసర్ (మన దిశ ): రైల్వే వంతెన నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ ఘట్కేసర్‌లో ప్రజలు బంద్‌కు పిలుపునిచ్చారు. రైల్వే గేటు వద్ద నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ బంద్‌కు వ్యాపారులు, విద్యాసంస్థలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలుచోట్ల దుకాణాలు మూతపడగా, పాఠశాలలు, కళాశాలలు సైతం బంద్‌కు సహకరించాయి.

రైల్వే వంతెన నిర్మాణం కోసం 18 ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే గేటు మూసివేసిన ప్రతిసారీ వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైల్వే వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై అధికారులు తక్షణమే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరించారు.

Tags: