Ibrahimpatnam

పోచారంలో కాలుష్య కోరల్లో ప్రజలు..!

రైస్ మిల్లులు, ప్లైవుడ్ పరిశ్రమలతో గాలి కాలుష్యం పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలి: చరణ్ రాజు గౌడ్

By ·

Share this article
పోచారంలో కాలుష్య కోరల్లో ప్రజలు..!

పోచారంలో కాలుష్య కోరల్లో ప్రజలు..!

రైస్ మిల్లులు, ప్లైవుడ్ పరిశ్రమలతో గాలి కాలుష్యం

పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలి: చరణ్ రాజు గౌడ్

ఇబ్రహీంపట్నం (మన దిశ ): ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామ పరిధిలో కొనసాగుతున్న రైస్ మిల్లులు, ప్లైవుడ్ పరిశ్రమల కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతోందని గ్రామస్థుడు చరణ్ రాజు గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి, పొగతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గ్రామ పరిధిలో సుమారు ఎనిమిది ప్లైవుడ్ పరిశ్రమలు కొనసాగుతున్నాయని, వీటి నుంచి వెలువడే కాలుష్యంతో స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్య సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశ్రమలను పరిశీలించాలని చరణ్ రాజు గౌడ్ కోరారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

Tags: