గ్లోబల్ సమ్మిట్‌కు పనులు సకాలంలో పూర్తి చేయాలి
స్కిల్స్ యూనివర్సిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన
రంగారెడ్డి జిల్లా, నవంబర్ 02 (మన దిశ ):స్కిల్స్ యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి జి . వివేక్ వెంకటస్వామి సోమవారం పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల పురోగతిని మంత్రి స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి KMV, KNR, MEIL కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ, మౌలిక వసతుల పనులను మంత్రి పరిశీలించారు. అదేవిధంగా రిథ్విక్ కంపెనీ చేపడుతున్న రేడియల్ రోడ్డు నిర్మాణ పనులను కూడా పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత ప్రతినిధులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని సంబంధిత కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను మరింత వేగవంతం చేసి, గ్లోబల్ సమ్మిట్ ప్రారంభానికి ముందుగానే అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంత్రి పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు, మీర్‌ఖాన్‌పేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.






