జగన్ కుటుంబానికి అండగా ఉంటాం
ఆపదలో కుటుంబానికి తోడుగా నిలుస్తాం.. కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి భరోసా
నోములలో జగన్ భౌతికకాయానికి నివాళి.. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం
నోముల (
మన దిశ ): నవతెలంగాణ మంచాల మండల రిపోర్టర్ పల్లాటి జగన్ ఆకస్మిక మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి అండగా నిలిచారు. జగన్ మృతి విషయం తెలుసుకున్న వెంటనే నోముల గ్రామానికి చేరుకున్న ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, జగన్ మృతిపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అనంతరం జగన్ భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జర్నలిస్టుగా సమాజంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జగన్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జగన్ ఆకస్మిక మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా జర్నలిస్టు వర్గానికి కూడా తీరని లోటని అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు.
కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తక్షణ ఆర్థికసాయాన్ని అందజేశారు. భవిష్యత్‌లోనూ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జగన్‌తో తనకున్న పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అభిషేక్‌రెడ్డి ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జగన్ మృతి చెందడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఈ కష్ట సమయంలో తాము వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక నాయకులు, జర్నలిస్టులు తదితరులు జగన్‌కు నివాళులర్పించి ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.






