రక్షకుడే కీచకుడయ్యాడు!
మైనర్ బాలికపై మారు తండ్రి లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు
బాలాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన | నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
బాలాపూర్ (మన దిశ ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై మారు తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి చదువుతున్న బాలికపై నిందితుడు గత నెల రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
భార్య ఇంట్లో లేని సమయంలో బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు చెబితే తన తల్లిని చంపేస్తానంటూ బాలికను బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో భయాందోళనకు గురైన చిన్నారి ఇన్నాళ్లూ ఈ విషయాన్ని తల్లికి చెప్పలేకపోయినట్లు సమాచారం.
అయితే ఇటీవల విషయం తెలుసుకున్న తల్లి నిందితుడిని పట్టుకుని, బాధిత బాలికతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు గులామ్ దురానీ అన్వర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
మైనర్ బాలికపై జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలికకు అవసరమైన రక్షణ, వైద్య సహాయం అందించే చర్యలు చేపట్టినట్లు సమాచారం.






