Rangareddy district

LRS క్లియరెన్స్‌పై పోస్టర్ల కలకలం

బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయ తలుపులకు పోస్టర్లు.. రెవెన్యూ అధికారిపై తీవ్ర ఆరోపణలు

By ·

Share this article
LRS క్లియరెన్స్‌పై పోస్టర్ల కలకలం

LRS క్లియరెన్స్‌పై పోస్టర్ల కలకలం

బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయ తలుపులకు పోస్టర్లు.. రెవెన్యూ అధికారిపై తీవ్ర ఆరోపణలు

బడంగ్‌పేట్ (మన దిశ ): LRS దరఖాస్తుల క్లియరెన్స్‌లో జాప్యం జరుగుతోందంటూ బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయం వద్ద వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. LRS దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేయాల్సిన రెవెన్యూ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదంటూ గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయ తలుపులకు పోస్టర్లు అంటించారు. గత కొంతకాలంగా LRS దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియ ఆలస్యమవుతోందని పేర్కొంటూ పోస్టర్లలో ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

LRS దరఖాస్తుల క్లియరెన్స్‌కు సంబంధించి డిటి మొహమ్మద్ యాసిన్ వ్యవహారశైలిపై పలువురు దరఖాస్తుదారులు ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. తమ దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నట్లు పోస్టర్లలో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతూ కాలయాపన చేస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

LRS ద్వారా తమ స్థలాల క్రమబద్ధీకరణ పూర్తవుతుందని ఆశిస్తున్న దరఖాస్తుదారులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలన, క్లియరెన్స్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

అయితే పోస్టర్లలో చేసిన ఆరోపణలపై సంబంధిత రెవెన్యూ అధికారి వివరణ తెలియాల్సి ఉంది. ఆరోపణలు నిజమా కాదా అన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉండగా, కార్యాలయ తలుపులకు పోస్టర్లు వెలవడం బడంగ్‌పేట్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Tags: