Rangareddy district

కలెక్టరేట్ గేటుకే విద్యుత్ స్తంభం అడ్డంకి!

ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. తొలగించాలని సిబ్బంది విజ్ఞప్తి

By ·

Share this article
కలెక్టరేట్ గేటుకే విద్యుత్ స్తంభం అడ్డంకి!

కలెక్టరేట్ గేటుకే విద్యుత్ స్తంభం అడ్డంకి!

ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. తొలగించాలని సిబ్బంది విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 26:

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న విద్యుత్ స్తంభం రాకపోకలకు ఆటంకంగా మారింది. కలెక్టరేట్‌కు విధులకు హాజరయ్యే సిబ్బందిని తీసుకొచ్చే ఆర్టీసీ బస్సులు ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లే సమయంలో, తిరిగి బయటకు వచ్చే సమయంలో స్తంభం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.

ప్రధాన ద్వారం వద్దనే విద్యుత్ స్తంభం ఉండటంతో బస్సులు మలుపు తీసుకునే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఒకేసారి వాహనాల రాకపోకలు ఉన్నప్పుడు ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని తెలిపారు. కలెక్టరేట్ వంటి ప్రధాన ప్రభుత్వ కార్యాలయ సముదాయం ప్రవేశద్వారం వద్దే ఇలాంటి సమస్య ఉండటంపై సిబ్బంది, సందర్శకులు అసౌకర్యం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసిన పరిస్థితులను సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైతే దాన్ని మరో ప్రాంతానికి తరలించాలని సిబ్బంది కోరుతున్నారు. రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రధాన గేటు వద్ద తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags: