దివంగత ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం బోరుబావి ఏర్పాటు
PRG ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం
కురవి
: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దివంగత ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం PRG ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలోని వైకుంఠధామం వద్ద బోరుబావిని ఏర్పాటు చేశారు. ఈ బోరుబావిని దివంగత వెంకన్న గుప్త పెద్ద కుమారుడు ప్రొద్దుటూరి వాసుదేవు గుప్త ప్రారంభించారు.
ఈ సందర్భంగా వాసుదేవు గుప్త మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యుల సొంత నిధులతో బోరుబావిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైకుంఠధామానికి వచ్చే ప్రజలు, గ్రామస్తులకు నీటి అవసరాలు తీరేలా ఈ బోరుబావి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దివంగత ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.
PRG ఫౌండేషన్ ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో దివంగత ప్రొద్దుటూరి వెంకన్న గుప్త సతీమణి ప్రొద్దుటూరి సోమలక్ష్మి, కుమారులు ప్రొద్దుటూరి వాసుదేవు గుప్త, రమణ గుప్త, రవీందర్ గుప్త, సురేందర్ గుప్త, దేవేందర్ గుప్త, హరేందర్ గుప్తతో పాటు కుటుంబ సభ్యులు, మనవళ్లు, మునిమనవళ్లు పాల్గొన్నారు.






