Yacharam Mandal

ప్రజాసమస్యలపై ప్రశ్నించేందుకు ‘Gen-Z టీమ్’ ఏర్పాటు

మొండిగౌరెల్లి గ్రామ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం

By ·

Share this article
ప్రజాసమస్యలపై ప్రశ్నించేందుకు ‘Gen-Z టీమ్’ ఏర్పాటు

ప్రజాసమస్యలపై ప్రశ్నించేందుకు ‘Gen-Z టీమ్’ ఏర్పాటు

మొండిగౌరెల్లి గ్రామ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం

మొండిగౌరెల్లి,  గ్రామంలోని ప్రజాసమస్యలను గుర్తించి, వాటిపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ పరిష్కారానికి కృషి చేసేందుకు ‘Gen-Z టీమ్’ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు, వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయడమే టీమ్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధిపై ఆసక్తి ఉండి, ప్రజాసమస్యలపై అవగాహన కలిగి, “నేను సైతం గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను” అనే ఆలోచన ఉన్న యువత Gen-Z టీమ్‌లో చేరాలని పిలుపునిచ్చారు. గ్రామ సమస్యలపై ప్రశ్నించే తత్వంతో పాటు, పరిష్కార మార్గాల కోసం కలిసి పనిచేసే యువత ముందుకు రావాలని కోరారు.

ప్రజల సమస్యే మా ప్రశ్న.. గ్రామ అభివృద్ధే మా లక్ష్యం అనే నినాదంతో ముందుకు సాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు టీమ్‌ను సంప్రదించి తమ వివరాలను మెసేజ్ ద్వారా తెలియజేయాలని కోరారు.

Tags: