Yacharam Mandal

పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుక

ఏవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన పట్టు వస్త్రాల అందజేత

By ·

Share this article
పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుక

పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుక

ఏవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన పట్టు వస్త్రాల అందజేత

యాచారం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దసరా పండుగ సందర్భంగా ఏవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గౌరవం లభించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఏవీజీ గెస్ట్ హౌస్‌లో పారిశుద్ధ్య కార్మికులకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేందుకు పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఉదయం నుంచి గ్రామంలోని వీధులు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు వారు చేస్తున్న కృషి వల్లే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతోందన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

దసరా పండుగ సందర్భంగా కార్మికులకు నూతన వస్త్రాలు అందించడం ద్వారా వారితో ఆత్మీయతను పంచుకోవడంతో పాటు, వారి సేవలకు గౌరవం తెలిపినట్లు అవుతుందని ఏవీజీ ఫౌండేషన్ చైర్మన్ (ఆడాల వరలక్ష్మి గణేష్ ) తెలిపారు. పండుగను సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం పండుగ సందర్భంగా వస్త్రాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న ఏవీజీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమపై చూపుతున్న ఆప్యాయత, గౌరవం మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.

దుర్గామాత ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ఏవీజీ ఫౌండేషన్ తరఫున ఆకాంక్షించారు.– ఏవీజీ ఫౌండేషన్

 తరపున ఆడాల వరలక్ష్మి గణేష్

Tags: