ఎల్లమ్మ గుడి నిర్మాణం ఆగదు!
తాటిపర్తిలో గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టమైన హామీ
“అధికారులతో మాట్లాడి అన్ని అడ్డంకులు తొలగిస్తా.. గుడి నిర్మాణం జరిగేలా చూస్తా”
యాచారం: తాటిపర్తి గ్రామంలో ఎల్లమ్మ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బలమైన హామీ ఇచ్చారు. ఫార్మాసిటీ పరిధిలో ఉందంటూ అధికారులు నిర్మాణ పనులను నిలిపివేయడంతో యువ నాయకులు, మాజీ సర్పంచ్, కుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు.
సమస్యను పూర్తిగా విన్న ఎమ్మెల్యే గుడి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడుతానని, నిర్మాణ పనులు కొనసాగేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టంగా హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్లమ్మ గుడి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.





