Telangana

వెనుక నుంచి ఢీకొన్న బైక్‌.. మహిళ దుర్మరణం!

యాచారంలో విషాద రోడ్డు ప్రమాదం.. తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి

By ·

Share this article
వెనుక నుంచి ఢీకొన్న బైక్‌.. మహిళ దుర్మరణం!

వెనుక నుంచి ఢీకొన్న బైక్‌.. మహిళ దుర్మరణం!

యాచారంలో విషాద రోడ్డు ప్రమాదం.. తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి

యాచారం: ద్విచక్ర వాహనం వెనుక నుంచి మరో బైక్‌ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన యాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన కొంగళ్ల పద్మ (45) తన భర్త మల్లేష్‌తో కలిసి బంతిపూలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చౌదర్పల్లి గేటు సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకోగానే, వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పద్మ రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న యాచారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: