ఉప్పల్ స్టేడియంలో లక్ష్మణ్ పేరుకు స్పెల్లింగ్ తిప్పలు!
VVS LAKMAN అంటూ బోర్డు ఏర్పాటు..
ప్రముఖ క్రికెటర్ పేరే తప్పుగా రాయడంపై అభిమానుల ఆగ్రహం
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని ఓ పెవిలియన్‌కు మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ పేరు పెట్టారు. అయితే పెవిలియన్ బోర్డుపై ఆయన పేరును **“VVS LAKMAN”**గా తప్పుగా రాయడం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ ఆటగాడి పేరును సైతం సరిగా రాయకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోర్డులోని తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.






