సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
హెలిప్యాడ్ వద్ద సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని నాగన్‌పల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి సోమవారం సాయంత్రం హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హెలిప్యాడ్ వద్ద సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, వీర్లపల్లి శంకర్, టీ. ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తాతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.






