Telangana

పండుగ వేళ బస్సుల రద్దు.. ప్రయాణికుల అవస్థలు

యథావిధిగా సర్వీసులు నడపాలని డిపో మేనేజర్‌కు వినతి

By ·

Share this article
పండుగ వేళ బస్సుల రద్దు.. ప్రయాణికుల అవస్థలు

పండుగ వేళ బస్సుల రద్దు.. ప్రయాణికుల అవస్థలు

యథావిధిగా సర్వీసులు నడపాలని డిపో మేనేజర్‌కు వినతి

యాచారం,  పండుగ వేళ గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోని యాచారం మండల గ్రామాలకు నడిచే సుమారు పది బస్సు సర్వీసులు గత మూడు రోజులుగా వివిధ కారణాలతో నిలిచిపోయాయి. దీంతో దసరా పండుగ సందర్భంగా వస్త్రాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు పట్టణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు రవాణా ఇబ్బందులు తప్పడం లేదు.

తాటిపర్తికి రెండు, కందుకూరుకు రెండు ట్రిప్పులతో పాటు మీర్‌ఖాన్‌పేట్‌, అజిల్‌పురం ఒక్కో సర్వీసు, మర్రిగూడ, కోధాస్‌పల్లి, మంథిన్‌గౌరెల్లి, మాల్ తదితర గ్రామాలకు నడిచే బస్సులు నిలిచిపోయినట్లు PRG ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్‌గుప్త ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రద్దైన సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

ఈ విషయంపై డిపో మేనేజర్‌ స్పందిస్తూ.. బస్సులు నిలిచిపోవడానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలుసుకుని, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను యథావిధిగా నడిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగ సమయంలో బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని రవీందర్‌గుప్త పేర్కొన్నారు.

Tags: