Medipally nakkrtha

మేడిపల్లి నక్కర్తలో ప్రత్యేక గ్రామ సభ

నీటి వనరుల పరిరక్షణ.. రబీ పంటలు, పశుగ్రాసంపై కీలక చర్చ

By ·

Share this article
మేడిపల్లి నక్కర్తలో ప్రత్యేక గ్రామ సభ

మేడిపల్లి నక్కర్తలో ప్రత్యేక గ్రామ సభ

నీటి వనరుల పరిరక్షణ.. రబీ పంటలు, పశుగ్రాసంపై కీలక చర్చ

యాచారం,  మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ ఆవరణలో అక్టోబర్ 17న ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరులు తగ్గుతున్న నేపథ్యంలో గ్రామీణ నీటి వనరుల పరిరక్షణ, జాగ్రత్తలు, రైతుల రబీ పంటలకు అవసరమైన నీటి లభ్యత, పశుగ్రాసం, గ్రామ ప్రజల జీవనోపాధి తదితర అంశాలపై ఈ ప్రత్యేక గ్రామ సభలో చర్చించనున్నారు.

ఈ గ్రామ సభకు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఉపసర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువతీ యువకులు, గ్రామస్థాయి అధికారులు హాజరై తమ సూచనలు, అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. గ్రామంలో భవిష్యత్‌లో నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునే విధానాలపై సభలో చర్చ జరగనుంది.

గ్రామాభివృద్ధి, రైతుల ప్రయోజనాలు, పశుసంవర్ధక రంగం, ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాలపై అందరి భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సకాలంలో హాజరై ప్రత్యేక గ్రామ సభను విజయవంతం చేయాలని గ్రామపంచాయతీ తరఫున విజ్ఞప్తి చేశారు.

Tags: