Medipally nakkrtha

మేడిపల్లి నక్కర్తలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

భగత్‌సింగ్ యూత్ ఆధ్వర్యంలో మహిళల ఆటపాటలతో సందడిగా వేడుకలు

By ·

Share this article
మేడిపల్లి నక్కర్తలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మేడిపల్లి నక్కర్తలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

భగత్‌సింగ్ యూత్ ఆధ్వర్యంలో మహిళల ఆటపాటలతో సందడిగా వేడుకలు

మేడిపల్లి నక్కర్త: తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగను మేడిపల్లి నక్కర్త గ్రామంలో భగత్‌సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళల ఐక్యతకు, గ్రామీణ ప్రాంతాల సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ వేడుకలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, పాటలు పాడుతూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

అనంతరం మండల ప్రజలకు, మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ పండుగలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Tags: