Telangana

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్

రూ.2.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సందీప్‌రెడ్డి కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

By ·

Share this article
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్

రూ.2.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సందీప్‌రెడ్డి

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

కీసర : మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కీసర డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి రూ.2.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఓ పని నిమిత్తం లంచం డిమాండ్‌ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చర్యలకు దిగినట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికతో కీసర తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న అధికారులు లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

అనంతరం కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం వ్యవహారానికి సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఈ ఘటనతో కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

సందీప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, లంచం డిమాండ్‌ చేయడానికి సంబంధించిన పరిస్థితులు, ఈ వ్యవహారంలో మరెవరైనా పాత్ర ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Tags: