Telangana

హైవేపై హోటళ్లలో ‘ఫుడ్ సేఫ్టీ’ సోదాలు!

ఎక్కడ చూసినా అపరిశుభ్రతే.. ఎలుకలు, బొద్దింకలు కుళ్లిన చికెన్‌.. గడువు ముగిసిన ఆహార పదార్థాలు

By ·

Share this article
హైవేపై హోటళ్లలో ‘ఫుడ్ సేఫ్టీ’ సోదాలు!

హైవేపై హోటళ్లలో ‘ఫుడ్ సేఫ్టీ’ సోదాలు!

ఎక్కడ చూసినా అపరిశుభ్రతే.. ఎలుకలు, బొద్దింకలు

కుళ్లిన చికెన్‌.. గడువు ముగిసిన ఆహార పదార్థాలు

లైసెన్సుల గడువు ముగిసినా యథేచ్ఛగా నిర్వహణ

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై హోటళ్లలో TG SAFE ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు మంగళవారం తనిఖీలు చేపట్టాయి. ఉదయం 11 గంటల నుంచి కొయ్యలగూడెం నుంచి కోదాడ వరకు హైవేపై ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.

వంటగదుల్లో తీవ్ర అపరిశుభ్రత

తనిఖీల్లో పలు హోటళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను నిల్వ చేసే ప్రాంతాల్లో ఎలుకలు, బొద్దింకలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. పరిశుభ్రత లేని వంటగదుల్లో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పప్పులు, ఇతర ముడి సరుకుల్లో పురుగులు ఉన్నట్లు తనిఖీ బృందాలు వెల్లడించాయి.

కుళ్లిన మాంసం.. సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ లేదు

మాంసం, పాల ఉత్పత్తులను నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో భద్రపరచకపోవడాన్ని అధికారులు గుర్తించారు. కొన్ని హోటళ్లలో ముందు రోజు వండిన ఆహారాన్ని నిల్వ ఉంచినట్లు తేలింది. మరికొన్ని చోట్ల గడువు ముగిసిన FSSAI లైసెన్సులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

చర్యలకు రంగం సిద్ధం

ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని TG SAFE ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తెలిపింది. ఉల్లంఘనల తీవ్రతను బట్టి షోకాజ్‌ నోటీసులు, లోపాల సవరణకు ఆదేశాలు, అవసరమైతే హోటళ్ల మూసివేత వంటి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వివరాలు తనిఖీ నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags: