Telangana

ఘనంగా RMP–PMP గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం

దసరా సందర్భంగా ‘అలయ్ బలాయ్’.. మూడు మండలాల వైద్యుల ఆత్మీయ కలయిక

By ·

Share this article
ఘనంగా RMP–PMP గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా RMP–PMP గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం

దసరా సందర్భంగా ‘అలయ్ బలాయ్’.. మూడు మండలాల వైద్యుల ఆత్మీయ కలయిక

మాల్ : దసరా పండుగను పురస్కరించుకుని మాల్ గ్రామంలో RMP–PMP గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం ‘అలయ్ బలాయ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పద్మావతి హాస్పిటల్ నూతన యాజమాన్యం సహకారంతో తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉక్కుల అశోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా యాచారం, మాడుగుల, చింతపల్లి మండలాలకు చెందిన గ్రామీణ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. గ్రామీణ వైద్యుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, ఆత్మీయ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో యాచారం మండల అధ్యక్షులు డాక్టర్ మంద మహేందర్, మాడుగుల మండల అధ్యక్షుడు విజయ్, చింతపల్లి మండల అధ్యక్షులు సైదులు, మాడుగుల మాజీ అధ్యక్షులు డాక్టర్ భాస్కర్, మూడు మండలాల కార్యదర్శులు, RMP–PMP వైద్యులు పాల్గొన్నారు.

వైద్యులకు ప్రత్యేక దావత్

సమ్మేళనానికి హాజరైన గ్రామీణ వైద్యుల కోసం పద్మావతి హాస్పిటల్ నూతన యాజమాన్యం ప్రత్యేక దావత్ ఏర్పాటు చేసింది. విందు ఏర్పాటుకు సహకరించిన మహేశ్వర్ రెడ్డి, కళ్యాణ్ కుమార్, సందీప్ రెడ్డిలకు RMP–PMP వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య రంగంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ ఆత్మీయ సంబంధాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో జిల్లా నాయకులు విప్ వెంకటేష్, కృష్ణ నాయక్, భిక్షపతి, ప్రొద్దుటూరు రవీందర్, సరికొండ వెంకటేష్, నాగిళ్ల వెంకటేష్, శ్రీనివాస్ చారి, పగడాల వెంకటేష్, ఎస్.ఎస్. చారి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: