Telangana

దాండియా వేడుకల్లో విషాదం.. MVSR కాలేజీలో ఘోర ప్రమాదం!

లిఫ్టింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి.. 12 మందికి గాయాలు

By ·

Share this article
దాండియా వేడుకల్లో విషాదం.. MVSR కాలేజీలో ఘోర ప్రమాదం!

దాండియా వేడుకల్లో విషాదం.. MVSR కాలేజీలో ఘోర ప్రమాదం!

లిఫ్టింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి.. 12 మందికి గాయాలు

నాదర్‌గుల్: రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. వేడుకల సందర్భంగా లిఫ్టింగ్ స్టాండ్ కూలిపోవడంతో ఒక విద్యార్థిని మృతి చెందగా, మరో 12 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతురాలిని సోనీగా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంలో ఆమె సోదరికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, స్టాండ్ నిర్మాణం మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

దాండియా సంబరాల్లో ఒక్కసారిగా అలుముకున్న విషాదంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Tags: