Ibrahimpatnam

వర్షం పడితే.. బస్టాండ్‌లో బురద రాజ్యం!

గుంతల్లో నీరు.. బురదలో ప్రయాణం | సీసీ రోడ్డు కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

By ·

Share this article
వర్షం పడితే.. బస్టాండ్‌లో బురద రాజ్యం!

వర్షం పడితే.. బస్టాండ్‌లో బురద రాజ్యం!

గుంతల్లో నీరు.. బురదలో ప్రయాణం | సీసీ రోడ్డు కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

యాచారం: యాచారం బస్టాండ్‌ ఆవరణ ప్రయాణికులకు సౌకర్యం కల్పించాల్సింది పోయి వర్షాకాలంలో ఇబ్బందులకు కేంద్రంగా మారుతోంది. వర్షం కురిసిన ప్రతిసారీ ఆవరణలోని గుంతలు నీటితో నిండిపోవడంతో బస్టాండ్‌ మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో బస్సుల కోసం వచ్చే ప్రయాణికులు బురదను తప్పించుకుంటూ నడవాల్సిన పరిస్థితి నెలకొంది.

బస్సుల రాకపోకలతో పాటు నిత్యం ప్రైవేటు వాహనాలు తిరుగుతుండటంతో ఆవరణలో గుంతలు మరింత పెరుగుతున్నాయి. వర్షం సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు వెళ్లే సమయంలో బురద, నీటిని దాటాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

బస్టాండ్‌ ఆవరణకు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు నిర్మించాలని ప్రయాణికులు, స్థానికులు పలుమార్లు కోరినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు పేర్కొంటున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్యను వాయిదా వేయకుండా బస్టాండ్‌ ఆవరణ మొత్తాన్ని అభివృద్ధి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్‌ ఆవరణను పరిశీలించి, గుంతలను పూడ్చడంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags: