Ibrahimpatnam

సద్దుల బతుకమ్మ సంబరాల్లో బుర్ర రేఖ మహేందర్ గౌడ్ సందడి

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మాజీ ఎంపీపీ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఘనంగా నివాళి

By ·

Share this article
సద్దుల బతుకమ్మ సంబరాల్లో బుర్ర రేఖ మహేందర్ గౌడ్ సందడి

సద్దుల బతుకమ్మ సంబరాల్లో బుర్ర రేఖ మహేందర్ గౌడ్ సందడి

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మాజీ ఎంపీపీ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఘనంగా నివాళి

అబ్దుల్లాపూర్‌మెట్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో మండల మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.

తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ ఆడి, పాటలు పాడుతూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకతను, మహిళల ఐక్యతను ఈ వేడుకలు చాటిచెప్పాయి.

ఈ సందర్భంగా మండల ప్రజలకు, మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ పండుగలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Tags: