రూ.20 లక్షల ‘డీల్’.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు!
అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్, సర్వేయర్‌పై ఏసీబీ కొరడా
అబ్దుల్లాపూర్‌మెట్: లేఅవుట్ అనుమతుల ప్రక్రియలో జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. మొదట రూ.30 లక్షలు డిమాండ్ చేసి.. చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నగదు స్వీకరిస్తున్న మండల సర్వేయర్ బాతుక శ్రీనివాసులను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆదేశాలు తహశీల్దార్‌వే.. నగదు సర్వేయర్ చేతికి!
తహశీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు సర్వేయర్ శ్రీనివాసులు లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో ఏసీబీ, సీఐయూ అధికారులు దాడి చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
వేళ్లకు రసాయన పరీక్ష.. పాజిటివ్
లంచం నగదు స్వీకరించిన సర్వేయర్ రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఏసీబీ సూచించింది.






