పట్టభద్రుల ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఆహ్వానం
శంషాబాద్: రాబోయే పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో సమన్వయం, ఎన్నికల సన్నాహక చర్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలోని బ్లాక్, మండల, మున్సిపల్, డివిజన్ అధ్యక్షులతో పాటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని పార్టీ నాయకత్వం కోరింది.
పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు పేర్కొన్నారు






