Ibrahimpatnam

నవతెలంగాణ రిపోర్టర్ పల్లటి జగన్ మృతి పట్ల సంతాపం

By ·

Share this article
నవతెలంగాణ రిపోర్టర్ పల్లటి జగన్ మృతి పట్ల సంతాపం

నవతెలంగాణ రిపోర్టర్ పల్లటి జగన్ మృతి పట్ల సంతాపం

కొత్త కుర్మ మంగమ్మ- శివకుమార్ 

నోముల గ్రామానికి చెందిన నవతెలంగాణ విలేకరి పల్లటి జగన్ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి

ఇబ్రహీంపట్నం( మన దిశ ): నోముల గ్రామానికి చెందిన నవతెలంగాణ విలేకరి పల్లటి జగన్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కొత్త కుర్మ శివకుమార్, మంగమ్మ తెలిపారు. ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లటి జగన్ పాత్రికేయ రంగంలో తనదైన శైలిలో సేవలందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు జర్నలిస్టు వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు.

జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. పాత్రికేయ రంగంలో పల్లటి జగన్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

పల్లటి జగన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అశ్రునివాళులు అర్పించారు.

Tags: