Ibrahimpatnam

మేడిపల్లి నక్కర్తలో ఘనంగా దసరా సంబరాలు

ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రిపోర్టర్లు పాల్గొని శుభాకాంక్షలు

By ·

Share this article
మేడిపల్లి నక్కర్తలో ఘనంగా దసరా సంబరాలు

మేడిపల్లి నక్కర్తలో ఘనంగా దసరా సంబరాలు

ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రిపోర్టర్లు పాల్గొని శుభాకాంక్షలు

మేడిపల్లి నక్కర్త:మేడిపల్లి నక్కర్త గ్రామంలో దసరా పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, రిపోర్టర్లు, గ్రామ పాలకులు పాల్గొని ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కలకొండ బీరప్ప, వార్డు నెంబర్ ఆలంపల్లి మహేష్, మాజీ వార్డు నెంబర్ ఆలంపల్లి నరసింహ, రిపోర్టర్ ఆలంపల్లి దుర్గేష్, మండల కార్యవర్గ సభ్యుడు ఆలంపల్లి జంగయ్య, 11వ వార్డు మెంబర్ వంగూరు జంగయ్య, మనోహర, కలకొండ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే జాల నాగరాజు (జేఎన్ఆర్) తదితరులు దసరా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దసరా పండుగ ప్రజల్లో సోదరభావం, ఐక్యతను పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, స్థానికులు కలిసి పండుగ సంబరాల్లో పాల్గొనడంతో మేడిపల్లి నక్కర్తలో దసరా వేడుకలు సందడిగా సాగాయి. గ్రామంలో ఐక్యత, స్నేహభావం మరింత బలపడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Tags: