Ibrahimpatnam

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి

సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో గ్రామానికి కొత్త రూపు.. సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్‌కు AVG ఫౌండేషన్ అభినందనలు

By ·

Share this article
గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి

సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో గ్రామానికి కొత్త రూపు.. సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్‌కు AVG ఫౌండేషన్ అభినందనలు

యాచారం( మన దిశ ): గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని AVG ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి గణేష్ కోరారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయమన్నారు.

గ్రామంలోని పలు ప్రాంతాలతో పాటు వైఎస్ఆర్ కాలనీ, AVG గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నూతన సీసీ రోడ్లను ఏర్పాటు చేయించడం పట్ల గ్రామ సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్‌ను AVG ఫౌండేషన్ తరఫున శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో సర్పంచ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆడాల వరలక్ష్మి గణేష్ అన్నారు.

గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, రహదారులు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులపై మరింత దృష్టి సారించాలని కోరుతూ, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులకు సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్‌కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

– ఆడాల వరలక్ష్మి గణేష్

AVG ఫౌండేషన్ చైర్మన్

Tags: