Ibrahimpatnam

బొంగులూరులో భారీ షెడ్డు.. పర్మిషన్లు ఉన్నాయా?

మెయిన్‌ రోడ్డును ఆనుకుని నిర్మాణం.. అధికారుల తీరుపై స్థానికుల ప్రశ్నలు

By ·

Share this article
బొంగులూరులో భారీ షెడ్డు.. పర్మిషన్లు ఉన్నాయా?

బొంగులూరులో భారీ షెడ్డు.. పర్మిషన్లు ఉన్నాయా?

మెయిన్‌ రోడ్డును ఆనుకుని నిర్మాణం.. అధికారుల తీరుపై స్థానికుల ప్రశ్నలు

బొంగులూరు: ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూరులో మెయిన్‌ రోడ్డును ఆనుకుని భారీ షెడ్డు నిర్మాణం కొనసాగుతుండటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్‌ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నారా? నిబంధనల ప్రకారమే నిర్మాణం జరుగుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మెయిన్‌ రోడ్డుకు ఆనుకుని నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారా? లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు మార్జిన్‌, సెట్‌బ్యాక్‌, నిర్మాణ విస్తీర్ణం తదితర నిబంధనలు పాటిస్తున్నారా అనే విషయాలను అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు.

అనుమతులు ఉంటే స్పష్టత ఇవ్వాలి.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆదిభట్ల మున్సిపల్‌ అధికారులు స్పందించి షెడ్డు నిర్మాణంపై తనిఖీ చేసి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు.

Tags: