Ibrahimpatnam

అస్మత్‌పూర్‌లో ఘనంగా పెద్దమ్మ–గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

By ·

Share this article
అస్మత్‌పూర్‌లో ఘనంగా పెద్దమ్మ–గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన

అస్మత్‌పూర్‌లో ఘనంగా పెద్దమ్మ–గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం (మన దిశ ): మంచాల మండలం అస్మత్‌పూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ, గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నాయకులు పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు నాయకులను ఘనంగా సత్కరించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దమ్మ, గంగమ్మ దేవతలను ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Tags: